MLA Vegulla : రధం గుడిలో ఘనంగా ఆర్ధ్రా నక్షత్రయుక్త అన్నాభిషేకం మహోత్సవము 74వ వార్షికోత్సవము

TRINETHRAM NEWS

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్, మండపేట పట్టణంలో శ్రీ జనార్ధన అగస్తేశ్వర దేవస్ధానం (రధం గుడి) నందు ఆర్ధ్రా నక్షత్రయుక్త అన్నాభిషేకం మహోత్సవము 74వ వార్షికోత్సవము ను శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సంధర్బంగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ శ్రీ జనార్ధన అగస్తేశ్వర దేవస్ధానం నందు వేంచేసియున్న శ్రీ ఉమా అగస్త్యేశ్వర, కైలాశేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటి సభ్యులు ఎమ్మెల్యే వేగుళ్ళ ను ఘనంగా సత్కరించారు.

పండితులు ఆశీర్వచనం అందించి, స్వామి వార్ల తీర్ధ ప్రసాదాలు ఎమ్మెల్యే వేగుళ్ళ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అగస్త్యేశ్వర స్వామి దేవస్ధానం చైర్మన్ చుండ్రు అగస్తిరాజు, అవసరాల వీర్రాజు, కె.విద్యాసాగర్, ఇ.ఒ కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The 74th anniversary of the Ardha Nakshatrayukta Annabhishekam Mahotsavam

You cannot copy content of this page

Scroll to Top