అభినందించిన ఎమ్మెల్యే వేగుళ్ళ…
త్రినేత్రం న్యూస్, ముంబాయిలో ఉన్న రంగోత్సవ సంస్ధ ఇటీవల ఆన్ లైన్ లో నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో మండపేట శ్రీ సత్యా డ్రాయింగ్ అకాడమి కి చెందిన సుమారు 86 మంది విధ్యార్ధులు బంగారు పతకాలు సాధించి జాతీయ స్ధాయిలో 4వ స్ధానం దక్కించుకుని తమ సత్తా చాటారు.
ఈ సంధర్బంగా శ్రీ సత్యా డ్రాయింగ్ అకాడమి వారు శనివారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గార్ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎమ్మెల్యే వేగుళ్ళ పతకాలు సాధించిన విధార్ధులను అభినందించి, పతకాలు, సర్టిఫికెట్ లను విధ్యార్ధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డ్రాయింగ్ టీచర్ మందపల్లి సత్యానందం, విధ్యార్ధుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


