త్రినేత్రం న్యూస్ నవంబర్, 06, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు ద్వారా ప్రభుత్వం రైతులు నుండి ధాన్యాన్ని సేకరిస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు , అన్నారు. మండపేట మండలం, ఏడిద గ్రామపంచాయతీ నందు రైతు సేవా కేంద్రం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాట్లాడుతూ రైతులు ధాన్యం విక్రయంలో, ఫార్మర్ ఫ్రెండ్లీ విధానాల ద్వారా రైతులకు, స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించిందన్నారు.
రైతులు తమకు నచ్చిన మిల్లుకు, నచ్చిన సమయం లో ధాన్యం విక్రయించుకునే అవకాశం ఇచ్చారన్నారు. రైతులు సులభంగా వాట్సాప్ లో హాయ్ పంపడం ద్వారా ధాన్యం విక్రయ ప్రక్రియలో చేరే సౌకర్యాన్ని కల్పించారన్నారు. ధాన్యం సేకరణలో జిల్లాను నెంబర్ వన్ స్థానంలో నిలపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, రామచంద్రపురం ఆర్డీవో దేవరకొండ అఖిల, జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ పి.శ్రీనివాస్, మండపేట తహశ్శిల్దార్ తేజేశ్వరరావు, ఎంపిడిఒ సత్యనారాయణ, వివిధ శాఖలు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


