Murder Case : కులం పేరుతో దూషించి దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి

TRINETHRAM NEWS
దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
-చట్టప్రకారం చర్యలు తీసు కోని పక్ష్యంలో రాష్ట్రమంతా బంద్ ,రాస్తారోకోలు.

దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జి ; ఇరుగ దిండ్ల కృష్ణ.

దేవరకొండ డివిజన్ నవంబర్ 08 త్రినేత్రం న్యూస్. దేవరకొండ ఇన్చార్జి ఇరుగదేండ్ల కృష్ణ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కొండపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల గాంధీ రెడ్డి వ్యక్తి మేడిపల్లి గ్రామానికి చెందిన కుంచపు రవి మందపల్లి గ్రామం నుండి డీ ఎక్స ఎన్ కంపెనీ నుండి ట్రాక్టర్ లో గ్రానైట్స్ తరలిస్తున్న సమయంలో గాంధీ రెడ్డి ట్రాక్టర్లు ను ఆపి కిందికి దిగురా అని ఈ రూట్ లో ఏ వాహనం నడవాలన్నా ఫస్ట్ నా పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే మీ పరిస్థితి ఏందో మాకు తెలుసు అని అన్ పార్లమెంట్ లాంగ్వేజ్ లో దూషిస్తూ సభ్య సమాజం తలదించు కునే నానా బూ తులు తిట్టి బూటు కాలుతో తన్నుతూ కొట్టడం, కులం పేరుతో దూషించి అవమాన పరచడం జరిగింది. ఈ సంఘటన 07 న సాయంత్రం నాలుగున్నర గంటలకు జరిగింది. కులం పేరుతో దూషించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని యెడల రాష్ట్ర వడ్డెర సంఘం మొత్తం ధర్నాలు చేస్తామని . కుంచపు రవి అనే బాధితునికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Strict action should be taken

You cannot copy content of this page

Scroll to Top