Happy Birthday to You Vijjanna : హ్యాపీ బర్త్ డే టూ యూ విజ్జన్న

TRINETHRAM NEWS

మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే..

వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు జన్మదిన వేడుకలు..

59 కిలోల కేకు ప్రత్యేకంగా తెప్పించి.. ఎమ్మెల్యే తో కేకు కట్ చేయించి..

పుట్టినరోజు వేడుకలు వైభవంగా.. నిర్వహించిన వెలిచాల

Trinethram News : పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు జన్మదిన వేడుకలను హైదరాబాదులో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాదులో పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు 59వ జన్మదినం పురస్కరించుకొని రాజేందర్ రావ్ ప్రత్యేకంగా 59 కిలోల కేకు తెప్పించి పుట్టినరోజు వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ రమణరావు చేత కేక్ కట్ చేయించి ఎమ్మెల్యేకు రాజేందర్రావు శాలువా పూలమాల వేసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా రాజేందర్ రావు విజయ రమణారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్రావు మాట్లాడుతూ పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పేదల పక్షపాతిగా వ్యవహరిస్తూ ప్రజల సేవలో తరిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నీతిగా నిజాయితీగా స్వచ్ఛందంగా పేదలకు అండగా నిలుస్తూ అత్యుత్తమ ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని తెలిపారు. పెద్దపెల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా మాడల్ గా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో పెద్దపెల్లి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆయురారోగ్యాలతో విలసిల్లుతూ పెద్దపెల్లి ప్రజలకు సేవలందిస్తూ మరింత మంచి పేరు తెచ్చుకోవాలని రాజేంద్ర రావు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గంట శ్రీనివాస్, ఆకుల నరసన్న, కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్, బట్టు వరప్రసాద్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Happy Birthday to You Vijjanna

You cannot copy content of this page

Scroll to Top