CITU : కాకినాడ జి జి హెచ్ లో పెట్రేగిపోతున్న సిఐటియు ఆగడాలను అరికట్టండి

TRINETHRAM NEWS

మహిళా సెక్యూరిటీ గాడ్స్ పై దాడి చేసిన రౌడీలను అరెస్టు చేయండి.
ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్…

త్రినేత్రం న్యూస్… కాకినాడ,మార్చి,07: ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ సెక్యూరిటీ గాడ్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం అధ్యక్షులు కె.వి రామయ్య అధ్యక్షతన శుక్రవారం జరిగిన సెక్యూరిటీ గార్డ్స్ దాడి పై శనివారం ఉదయం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మెయిన్ గేటు వద్ద నిరసన ఆందోళన ధర్నా జరిగింది.

ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా సెక్యూరిటీ గార్డ్స్ పై దాడి చేసిన సిఐటియు దుర్గా అల్లరి మూకల రౌడీలను తక్షణమే అరెస్టు చేయాలని, షేర్ దుర్గ ఉద్యోగం నుండి తొలగించాలని, మహిళలపై సిఐటియు దాడి చేయించడం సిగ్గు సిగ్గు అని నినాదాలు చేయడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సెక్యూరిటీ గార్డ్స్ పొట్టి రామలక్ష్మి, కాటూరి రాజులను పరామర్శించారు. సమస్యను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డ్స్ పై విచక్షణ రహితంగా దాడులు చేయడం, సెక్యూరిటీ గార్డ్స్ పై పిడుగులు గుద్దడం స్పృహ కోల్పోయేంత గా కొట్టడం అనేది చాలా బాధాకరంగా ఉందని, మహిళలైనా చూడకుండా వారిపై దాడి చేయించడం సిఐటియుకు సిగ్గు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఒక కుటుంబంలో కలిసిమెలిసి విధులు నిర్వహిస్తున్నారని, అటువంటి వారి మధ్య చిచ్చులు పెట్టేందుకు అసమర్థ వర్గాన్ని ప్రోత్సహించి గ్రూపులు కట్టి కార్మికులను రెచ్చగొట్టే విధంగా సిఐటియు సీనియర్ నాయకులు తర్ఫీధిస్తున్నారని, మహిళలపై దాడులు చేస్తున్న సిఐటియు వంకర బుద్ధి మారలేదని ఆయన అన్నారు.

మహిళలపై దాడులు జరిగిన సిఐటియు సీనియర్ నాయకులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, వారిచ్చిన ఆదేశాలే జిజిహెచ్ లో వారి కార్యకర్తలు అమలు జరుపుతున్నారని ఆయన అన్నారు. కార్మికుల సమస్యలపై కాంట్రాక్టర్ తో పొట్లాడాలి, ఆసుపత్రి సూపర్డెంట్ సమస్యలను వివరించాలి కానీ యూనియన్ల పై విభేదాలు సృష్టించడం అనేది సిఐటియు ఎజెండా ఉందని,ఒకపక్క ప్రజా సంఘాల ఉద్యమాలు చేస్తూనే మరోపక్క ఇతర ట్రేడ్ యూనియన్ సంఘాలపై దాడులు చేయించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన అన్నారు .

సెక్యూరిటీ గార్డ్స్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తక్షణమే అరెస్టు చేయాలని లేకుంటే దీనిపై ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన అన్నారు. సెక్యూరిటీ గార్డ్స్ పై సిఐటియు దాడి వాస్తవం లేదని పత్రిక ప్రకటించడం సిగ్గుగా ఉందని, ఇదే వారి సంఘాలపై దాడి చేస్తే ప్రభుత్వ కార్యాలయాల పై దండయాత్ర చేస్తారని ఇప్పటికైనా సీఐటీయూ, కుంటి ప్రకటన లు పక్కన పెట్టి వాస్తవాలు తెలుసుకోవాలని, కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫీసు వద్ద మహిళ సెక్యూరిటీ దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని కాంట్రాక్ట్ వారికి తెలియజేసి నిరసన తెలియజేయడం జరిగింది ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్. అనిల్ కుమార్,మధు,జాన్ బాబు, వెంకటేష్, లోవ, మీరాభి, రమణమ్మ, రమణి, నాగూర్ బి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Stop the CITU riots

You cannot copy content of this page

Scroll to Top