పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసిన హనుమకొండ జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు వేల్పుల సారంగపాణి యాదవ్
హనుమకొండ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బాలసముద్రం, ఏకశిలా పార్కు దగ్గర ఏఐటీయూసీ 106 వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వేల్పుల సారంగపాణి యాదవ్ అధ్యక్షత వహించి సమావేశంలో మాట్లాడుతూ… ఏఐటీయూసీ 1920లో స్థాపించబడిన దేశంలోని అతి పురాతన కార్మిక సంఘం అని, భారత కార్మిక వర్గ చరిత్రలో ఈ సంఘం పోషించిన పాత్ర అపూర్వమని తెలిపారు. కార్మికుల హక్కుల సాధన, ఉద్యోగ భద్రత, కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కార్మికుల న్యాయ హక్కుల కోసం ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్న ప్రజాస్వామ్య కార్మిక సంఘమే ఏఐటీయూసీ అని చెప్పారు.
“ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయి. కార్మిక చట్టాలను బలహీనపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా ముందుకు రావాలి. హనుమకొండ జిల్లాలోని ప్రతి మండలంలో, ప్రతి రంగంలో ఏఐటీయూసీ 106 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి కార్మిక ఐక్యతను బలపరచాలి” అని పిలుపునిస్తూ రాబోయే కాలంలో కార్మిక హక్కులు కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణం రద్దు చేయాలని ,కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని ,కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ప్రత్యక్ష కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని , పెన్షన్ హక్కులను పునరుద్ధరించాలని నిరుద్యోగ భృతి అమలు చేయాలని అన్ని రంగాల ఉద్యోగులకు, కార్మికులకు, సామాజిక భద్రత కల్పించాలని, కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా సిపిఐ పార్టీ నాయకులు మద్దేల ఎల్లేష్,నద్దూనురి వేంకట్రాజ్యం ,ఎన్.ఎ.స్టాలీన్, కొట్టేపాక రవి, హనుమకొండ జిల్లా ఏఐటీయూసీ సహాయ కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మముల రాంమూర్తి, మాలోత్ శంకర్ నాయక్,మద్దేల శ్రీనివాస్,లలత మండల సమితి ప్రతినిధులు, ట్రేడ్ యూనియన్ నాయకులు మరియు వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


