త్రినేత్రం న్యూస్, మండపేట మండలం ఆర్తమూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పడాల భూలక్ష్మి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పలువురు నాయకులు శనివారం పరామర్శించారు.
భూలక్ష్మి భర్త, కోళ్ల రైతు సంక్షేమ సంఘం నాయకులు, పౌల్ట్రీ పరిశ్రమ నాయకులు పడాల సుబ్బారెడ్డి మరియు ఆమె సోదరులు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, రాజోలు నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు కర్రీ పాపారాయుడు లను మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అలాగే మండపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి కూడా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మొండి భవాని, మురళి, నీలం దుర్గా, తాడి రామారావు, రామిశెట్టి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


