త్రినేత్రం న్యూస్, మండపేట. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మండపేట ఏడిద రోడ్డులో కొలువైన భక్తుల కొంగుబంగారమైన శ్రీ పావన పేరంటాలమ్మ ఆలయం,లో భక్తజన సందోహం మార్మోగింది. ఈ ఆలయంలో సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర తీర్థ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
గురువారం ఉదయం నుంచే భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్, మండపేట నియోజకవర్గ ఇన్‌చార్జి,ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, తన వియ్యంకుడు రవితో కలిసి ఆలయానికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు, నిర్వహించారు.
ఆలయ అధికారులు, భక్తులు మర్యాదలతో స్వాగతం పలికారు . పేరంటాలమ్మ ఆలయానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తారు. ముఖ్యంగా కొత్తగా వివాహమైన జంటలు అమ్మవారిని దర్శించడం పరిపాటి . వివాహం తర్వాత సంతానం కలిగితే మొక్కులు చెల్లించడం, కావిడి కుండలో ప్రసాదం సమర్పించడం ఇక్కడి విశేషం. ఈ నేపథ్యంలో ఆలయాన్ని ముస్తాబు చేశారు.
ఈ సందర్భంగా అమ్మవారికి శారీ, కావిడి సమర్పణలు చేశారు. భక్తులు అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని తోట ప్రార్థించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


