ప్రజల్ని టిడిపి మోసం చేస్తుంది…
నరకాన్ని ఏర్పాటు చేసింది ఎమ్మెల్యే వేగుళ్లే …
వస్తానంటే చర్చ కు సిద్ధం…
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మండపేట : మండపేట గొల్లపుంత లో నిర్మించిన టిట్కో అపార్ట్మెంట్ల రుణాలను తక్షణం రద్దు చేయాలని మండపేట నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రచారంలో టిట్కో రుణాలు రద్దు చేస్తామని ఎమ్మెల్యే వేగుళ్ళ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల రెండో విడత అపార్ట్మెంట్ లు ప్రారంభ కార్యక్రమానికి తాను వెళ్లానని అక్కడ ఈ విషయాలు మాట్లాడితే సభను తప్పుదోవ పట్టించడానికి తాను ప్రయత్నించాననీ అంటూ దుష్ప్రచారం చేస్తారనే ఉద్దేశంతో ఆనాడు మాట్లాడలేదని పేర్కొన్నారు.
నాలుగు అంతస్తులు ఆలోచన లేకుండా ఆనాడు నిర్మించారన్నారు. తక్షణమే ఆయా అపార్ట్మెంట్లకు లిఫ్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరించాలని, మెయింటైన్ చార్జీలు కూడా ప్రభుత్వ భరించాలని పేర్కొన్నారు. టిడ్కో లబ్ధిదారులు విపరీతంగా ఇబ్బందులు పడి బాధపడుతున్నారని వాపోయారు. తమ ఇక్కట్లు మంత్రి నారాయణ చెప్పుకుందామని వెళితే వెళ్లకుండా పోలీసులు నియంత్రించారని ఆరోపించారు.
మంత్రి కష్టసుఖాలు తెలుసుకోవాలీ కదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ అపార్ట్మెంట్లలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసి ఇచ్చామని గుర్తు చేశారు. 2019 ఎన్నికల ముందు గృహప్రవేశాల పేరిట హడావిడి చేసి ప్రారంభోత్సవాలు చేశారని విమర్శించారు. కనీసం సెప్టిక్ ట్యాంకులు తాగునీరు పూర్తి చేయకుండా రిబ్బన్ కట్ చేసేసారని ఎద్దేవా చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసినట్లు వివరించారు. వాటర్ ట్యాంకు పైప్ లైన్ , మరుగుదొడ్లు ట్యాంకర్ పనులతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు.
ఇపుడు రెండో విడతలో ఆరు వేల ఇల్లు ఇచ్చామంటూ ప్రచారం చేసుకుంటున్నారని గతంలో ఇచ్చిన అపార్ట్మెంట్ లో బ్లాకుల్లో కాపురం చేస్తున్న వారు పడే బాధలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. వారు నరకంలో ఉంటున్నారని పేర్కొన్నారు. నరకంలో ఉంటున్నారనే మాట తాను అనడం లేదని గత ఎన్నికలకు ముందు కాలనీలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రచారం నిర్వహిస్తూ కాలనీవాసులు నరకంలో ఉంటున్నారని తాను అధికారులకు వస్తే స్వర్గం చేయిస్తానని పేర్కొన్నారనీ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ లను ఆయన చూపించారు.
ఎన్నికల అవసరాల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఆయనకు అలవాటేనని మండిపడ్డారు. 2017 లో లక్ష రూపాయలు కట్టినవారు అటు అద్దెలు చెల్లిస్తూ ఆ డబ్బులకు వడ్డీలు కడుగుతూ ఎన్నో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. షేర్ వాల్ టెక్నాలజీ పేరిట ప్రజల్ని టిడిపి ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొన్నారు. మండపేటలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి 125 ఎకరాలు సేకరించి 50 వేల ఎకరాల్లో పట్టాలు పంపిణీ చేశారన్నారు.
అనంతరం మిగిలిన 50 ఎకరాల్లో అక్కడ పట్టాలు ఇచ్చిన వారిని రద్దుచేసి అపార్ట్మెంట్లు నిర్మించారని విమర్శించారు. టిడిపి నేతలు అవకాశవాదులు అని అవసరం తీరిన తర్వాత చేతులు దులుపుకొని పోయే రకమని విమర్శించారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత వ్యక్తిగత ఇంటి నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. జగన్ హయాంలో 20 లక్షల మందికి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట గుర్తు చేశారు. షేర్ వాల్ టెక్నాలజీ పేరిట పేద ప్రజలను దోచుకున్నారన్నారు.
పేదవాడు సంతోషంగా ఉండాలంటే సొంత ఇల్లు ఉండాలని కానీ ఆ అపార్ట్మెంట్లలో పై నుండి వర్షం నీరు, మురుగు నీరు వెళ్లే దారి లేక వరండా లేక పిచ్చుక గూళ్ళు లాంటి ఇళ్లలో నివసిస్తున్నారనీ విమర్శించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ విదేశాల్లో అత్యుత్తమ డిజైన్ పరిశీలించి షేర్ వాల్ టెక్నాలజీ వాడమని చెబుతున్నారని ఇదేం టెక్నాలజీ అంటూ ప్రశ్నించారు. గతంలో అపార్ట్మెంట్లు నిర్మించే ముందు చదరపు గజానికి రూ వెయ్యి ఇస్తే తాము నిర్మించేస్తామని ఇక్కడి స్థానిక వైసిపి నాయకులు ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో చదరపు గజానికి రూ 1800 వసూలు చేసి కొన్ని వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు.
అక్కడ ఇబ్బందులు పడుతూన్న వారి ఉసురు ఎమ్మెల్యే వేగుళ్ళ కు తగులుతుందని పేర్కొన్నారు. అపార్ట్మెంట్లలో నివసిస్తున్న కనీసం వంద మందిని తాము ఆనందంగా ఉన్నామని చెప్పించమని తోట సవాలు విసిరారు. అక్కడ వారిని అడుగుదాం మూడు నాలుగు ఫ్లోర్లలో ఎవరైనా కాపురం ఉంటున్నారేమో చూద్దాం రండి అంటూ సవాల్ విసిరారు. నీళ్లు లేవు డ్రైనేజీ వ్యవస్థ లేదని దుయ్యబట్టారు. షేర్ వాల్ టెక్నాలజీతో ఆయా నాయకులు ఇల్లు ఎందుకు నిర్మించుకోవడంలేదని ప్రశ్నించారు.
మేకులు కొట్టే వీలు లేని పరిస్థితి ఉందని వాపోయారు. బ్యాంకు రుణాలు రద్దు చేస్తామని ఎన్నికల ముందు చెప్పారని ఇపుడు ఈ విషయం ఎక్కడ మాట్లాడ్డం లేదని తప్పు పట్టారు. బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడితే వచ్చినట్టే కట్ అయిపోతున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అపార్ట్మెంట్ సమస్యలపై చర్చించడానికి ఎమ్మెల్యే వేగుళ్ల వస్తానంటే తాను సిద్ధమేనని సవాల్ చేశారు. లక్ష రూపాయలు అపార్ట్మెంట్ వద్దనుకునే వారికి డిపాజిట్ సొమ్ము వడ్డీతో సహా చెల్లించాలని పేర్కొన్నారు. రుణాలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల్ని టిడిపి పలు రకాలు మోసం చేస్తుందని దుయ్యబట్టారు. ఇప్పుడున్న నరకాన్ని ఏర్పాటు చేసింది ఎమ్మెల్యే జోగేశ్వరరావు నని ఎద్దేవా చేశారు. లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, జిల్లా జనరల్ సెక్రటరీ యర్రగుంట అయ్యప్ప, రూరల్ కన్వీనర్ అడబాల బాబ్జీ, పిల్లా వీరబాబు, పాలికి శ్రీను, దార్ల సతీష్ కుమార్, పోతుల ప్రసాద్, జొన్నపల్లి సత్తిబాబు, పోలిశెట్టి గణేష్, పోతుల రాంబాబు, చింతా సురేష్ రెడ్డి, మీగడ శ్రీనివాస్, యర్రంశెట్టి నాగేంద్ర, యర్రంశెట్టి సత్యనారాయణ, వీధి గంగాధరరావు, మద్దింశెట్టి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


