త్రినేత్రం న్యూస్ / షాబాద్ ప్రతినిధి… షాబాద్ మండలంలోని దామరపల్లి గ్రామ పంచాయతీ గ్రామంలో సర్పంచ్ పొన్న చైతన్య కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళల కోసం ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన వారికి షాబాద్ సీఐ కాంతా రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ కాంతా రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందించి సంస్కృతిని కాపాడుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. నాధర్ ఖాన్‌పేట్ గ్రామం మొత్తం సంక్రాంతి పండుగ శోభతో కళకళలాడింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


