వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. శుక్రవారము కలెక్టరేట్‌లోని డీపీఆర్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎంసిఎంసీ సెంటర్ ను జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ రాజేశ్వరి,అదనపు కలెక్టర్ సుదీర్ లతో కలిసి మీడియా సెంటర్ ను ప్రాంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వచ్చే రాజకీయ వార్తలపై పటిష్టమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. దినపత్రికలు, స్థానిక ఛానళ్లలో వచ్చే వార్తలను నిశితంగా గమనించాలని, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉండే అంశాలను వెంటనే గుర్తించాలని సూచించారు.
అనుమానిత పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక దృష్టి సారించి, వాటి వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు, ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మీడియా సెంటర్‌కు సంబంధించి అన్ని రకాల రిజిస్టర్ లను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ వాసుచంద్ర, డి పి ఆర్ ఓ చెన్నమ్మ, ఇ డి ఎస్సి కార్పోరేషన్ బాబు మోసెస్ అసిస్టెంట్ పి ఆర్ ఓ ప్రభాకర్, తహసిల్దార్ ఆనంద రావు , డీ.పీ.ఆర్.ఓ. కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


