Municipal Election : జహీరాబాద్ మునిసిపల్ ఎన్నికల సమీక్షా సమావేషం

TRINETHRAM NEWS

జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. జహీరాబాద్ పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ మున్సిపాలిటీ మరియు నూతనంగా ఏర్పాటు చేసిన కోహిర్ మునిసిపాల్టీల ఎన్నికల సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..
ఈ సమావేశంలో *మాజీ మంత్రివర్యులు డా||చంద్రశేఖర్ ప్రసంగిస్తూ రానున్న మునిసిపల్ ఎన్నికల్లో అందరూ నాయకులు కార్యకర్తలు సమీక్షిగా పని చేసి కాంగ్రెస్ జెండా ఎగరవేయలని కొరకు, అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పార్టీ పరంగా సమన్వయం పాటించి అధిష్టానం మొగ్గు చూపినా వారికే ఈ ఎన్నికల్లో పని చేసి ప్రతి ఒక్కరికీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమా పథకాలను వివరించి జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తూ అభ్యర్థుల గెలుపు దిశగా కృషి చేసి జహీరాబాద్ లో మరియు కోహిర్ లో కాంగ్రెస్ జెండా ఎగరేవేయాలని కోరారు..
ఈ కార్యక్రమంలో మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ తన్వీర్ ,కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి , ఆత్మ కమిటీ చైర్మన్ రామ లింగారెడ్డి , పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు , మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పాటిల్ , మాక్సూద్ అహ్మద్ , నరసింహా రెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబ్బాసుం ,కాంగ్రెస్ నాయకులు మంకల్ శుభాష్ , హుగ్గేల్లి రాములు , కోహిర్ పట్టణ అద్యక్షులు శంషీర్ , మాజీ ఎంపీపీ షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Zaheerabad Municipal Election Review Meeting

You cannot copy content of this page

Scroll to Top