త్రినేత్రం న్యూస్. అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం చేసిన చందన నాగేశ్వర్….
కడియం మండలం మురమండలో అగ్నిప్రమాద బాధితులకు చందన నాగేశ్వర్ అండగా నిలిచారు. సర్వం కోల్పోయిన దివ్యాంగుల కుటుంబాన్ని మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్.
మరియు రాజానగరం వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) చందన నాగేశ్వర్ పరామర్శించి, 10,000 రూపాయలు నగదు సాయం అందజేశారు. మురమండ పశువుల ఆసుపత్రి సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో దివ్యాంగులైన భీమన సూరిబాబు, ఝాన్సీల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
ఈ విషయం తెలుసుకున్న చందన నాగేశ్వర్ స్థానిక నాయకులతో కలిసి బాధితులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో కడియం మాజీ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఈలి గోపాలం , అయినవిల్లి వెంకటేశ్వరరావు , మేక రామారావు తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


