- గుడ్ సమారిటన్ పథకంపై కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీసుల అవగాహన…
కూకట్ పల్లి, జనవరి 30 (త్రినేత్రం న్యూస్) : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వెంటనే సహాయం చేసి ప్రాణాలు కాపాడేలా ప్రజలు ముందుకు రావాలని కూకట్ పల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప పిలుపునిచ్చారు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతంగా గుర్తించిన కూకట్ పల్లి బస్‌స్టాప్ సమీపంలో శుక్రవారం రోడ్డు భద్రతపై ప్రత్యేక ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ గుడ్ సమారిటన్ స్కీమ్ గురించి ప్రజలకు వివరించారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి చేర్చిన లేదా తక్షణ సహాయం చేసిన వారికి ప్రభుత్వం రూ.5,000 నగదు బహుమతి అందిస్తుందని తెలిపారు.
అంతేకాకుండా సహాయం చేసిన వ్యక్తులకు చట్టపరమైన రక్షణ ఉంటుందని, పోలీస్ కేసులు లేదా కోర్టు హాజరు భయం అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రమాద బాధితులకు “గోల్డెన్ అవర్”లో అందించే సహాయం ప్రాణాలను కాపాడటంలో కీలకమని పేర్కొన్నారు. కేవలం భయంతో లేదా అనవసర అపోహలతో ప్రజలు వెనుకడుగు వేయకుండా, మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు, వాహనదారులు పాల్గొని పథకం వివరాలను తెలుసుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


