MLA Veerlapalli Shankar : సైన్స్ తోనే సమాజ పురోగతి

TRINETHRAM NEWS

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కుంటబడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

త్రినేత్రం న్యూస్/ షాద్నగర్ ప్రతినిధి.. మానవ సమాజ నిర్మాణంలో జన్యుశాస్త్రం పాత్ర ప్రత్యేకమైనదని, ఈ విద్యార్థులు తెలుసుకోవడం ఎంతో అవసరమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పద్మావతి కాలనీ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కోసం నూతనంగా ఏర్పాటుచేసిన సైన్స్ ల్యాబ్ ను షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్ స్థానిక కౌన్సిలర్ పెంటయ్య, ఎంఈఓ మనోహర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగ్యమ్మలతో కలసి ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్.

అనంతరం విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటు చేస్తున్న వాష్ రూం లను పరిశీలించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ప్రధానోపాధ్యాయురాలు భాగ్యమ్మ ఆధ్వర్యంలో పాఠశాల విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్,కౌన్సిలరు దిలీప్, మురళీమోహన్(అప్పి)సాధిక్, ముబారక్ అలీ ఖాన్, అనిల్, చందు, ఖదీర్ ప్రదీప్ ముదిరాజ్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Society progresses with science

You cannot copy content of this page

Scroll to Top