Anjaiah Yadav : సమాజంలో అందరూ సోదరభావంతో మెలగాలి

TRINETHRAM NEWS

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సయ్యద్ హఫీజ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు

త్రినేత్రం న్యూస్/ షాద్నగర్ ప్రతినిధి… జిల్లేడు చౌదరిగూడ మండలకేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సయ్యద్ హఫీజ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ సర్వమత సమానత్వానికి కట్టుబడి ఉంటుందని, నియోజకవర్గంలో సామరస్య వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని, మైనారిటీ సోదరుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Everyone in the society should live in brotherhood

You cannot copy content of this page

Scroll to Top