కోర్టు కాంప్లెక్స్ లో పట్టణ న్యాయవాదులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 16వ జిల్లా అదనపు జడ్జి ఎస్.స్వాతి రెడ్డి
కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మల్యాల సాహితి
కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్
త్రినేత్రం న్యూస్ /షాద్నగర్ ప్రతినిధి… ఆరోగ్యమే మహాభాగ్యమని న్యాయవాదులకు వృత్తిరీత్యా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని, మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉంటారని, న్యాయవాదులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వృత్తిపరమైన ఆటంకాలు లేకుండా పనులు సాఫీగా జరుపుకుంటారని, న్యాయవాదులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా, ఎల్లప్పుడూ వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి న్యాయవాదులు వైద్య పరమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ వారు నిర్వహిస్తున్న ఉచిత మెగా హెల్త్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 16వ జిల్లా అదనపు జడ్జి ఎస్.
స్వాతి రెడ్డి న్యాయవాదులకు సూచించారు. షాద్ నగర్ పట్టణం న్యాయవాద బార్ అసోసియేషన్ అధ్యక్షులు నర్వ వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి గుండుబావి శ్రీనివాస్ రెడ్డి మరియు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్స్ వారి సౌజన్యంతో న్యాయవాద బార్ అసోసియేషన్ లో నిర్వహించబడుతున్న మెగా హెల్త్ క్యాంప్ ను 16వ జిల్లా అదనపు జడ్జి, స్వాతి రెడ్డి ప్రారంభించారు.
హెల్త్ క్యాంపులో పట్టణ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ రక్త పరీక్షలు, కార్డియాలజీ, దంత పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలకు అవసరమైన మందులను సూచిస్తూ తగు తగు జాగ్రత్తలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులతో పాటు పాటు అపోలో హాస్పిటల్స్ డాక్టర్ సిమ్రాన్, ప్రవల్లిక, భార్గవి, అరుణ, నిరోష తదితరులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


