MLA Veerlapalli Shankar : రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతుళ్లు మరణించడం ఎంతో బాధాకరం

TRINETHRAM NEWS

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దిగ్భ్రాంతి

ఇలాంటి ఘటనలు హృదయాన్ని కలిచి వేస్తున్నాయని ఆవేదన

Trinethram News : షాద్ నగర్ పట్టణంలోని చౌరస్తాలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతుర్లు దుర్మరణం పాలు కావడం ఎంతో బాధాకరమని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ జరిగిన సంఘటన ఎంతో బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తుతో తన కూతురిని చదివించేందుకు పొద్దున్నే బైక్ పై వెళ్తున్న తండ్రి కూతుర్లు అనుకోని సంఘటనతో లారీ కిందపడి ప్రమాదంలో మృత్యువాత పడడం జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు.

కూతురు చదువుకోమని వెళుతున్న సందర్భంగా ఈ ఘటన జరగడం ఎంతో దురదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు హృదయాన్ని ద్రవింపజేస్తాయని ఆయన పేర్కొన్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని మనం తప్పు చేయకపోయినా ఎదుటి వాళ్ళు చేసే తప్పుకు అమాయకులు ఇలా బలవుతుంటారని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. రోడ్లపై ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ శాఖకు కూడా తను ఆదేశించినట్లు తెలిపారు. చిన్న చిన్న కారణాలతో ప్రజల ప్రాణాలు పోకూడదని ఆయన స్పష్టం చేశారు. వృద్ధుల కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Veerlapalli Shankar

You cannot copy content of this page

Scroll to Top