మెడికల్ ఎంప్లాయిస్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ, వర్కర్స్ యూనియన్,మహాసభలో
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు
త్రినేత్రం న్యూస్, కాకినాడ,అక్టోబర్, 24: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ & సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో శుక్రవారం మధ్యాహ్నం స్థానిక యూనియన్ కార్యాలయం వద్ద 8 వ మహాసభ రామయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన తాటిపాక మధు, మాట్లాడుతూ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ కాంట్రాక్టర్ సెక్యూరిటీ గార్డ్స్ కు జీవో ప్రకారంగా జీతాలు మంజూరు చేయడం లేదని, శ్రమకు తగిన వేతనం రావడం లేదని శ్రమ దోపిడీకు గురి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 138 ప్రకారంగా ఈపీఎఫ్ ఈఎస్ఐ తో కలిపి వేతనంగా 18600 మంజూరు చేయవలసి ఉండగా కేవలం 12,100 రూ.. మాత్రమే మంజూరు చేస్తున్నారన్నారు. అదనపు డ్యూటీల బకాయి వేతనాలు, ఈపీఎఫ్ ఈఎస్ఐ తో కలిపి తక్షణమే చెల్లించాలని, సెక్యూరిటీ గార్డ్స్ కు వారాంతపు సెలవుతోపాటు 21 పండగ సెలవులు అమలు చేయాలని, సెక్యూరిటీ గార్డ్స్ ను ఆప్కాస్ లో విలీనం చేయాలని, సెక్యూరిటీ గార్డ్స్ కు తుమ్మిన, దగ్గిన ఉపాధి నిలిపి వేస్తున్నారని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన అన్నారు. యూనిఫారం రెండు జతలు అందజేసి కుట్టు కూలి మంజూరు చేయాలని ఆయన అన్నారు. పిఎఫ్ ఈఎస్ఐ ఖాతాలో జమైనది ఎప్పటికప్పుడు సెక్యూరిటీ గార్డ్,కు తెలియపరిచేందుకు ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ల నియమించాలని, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో నిత్యం రోజుకి 4,000 మంది పైనే వైద్య సౌకర్యం నిమిత్తం వస్తున్నా పేషెంట్లకు,వారి బంధువులకు పార్కింగ్ స్థలం తీవ్రత ఇబ్బందులకు గురి చేస్తుందని, ప్రజలకు అసౌకర్యాలు ఏర్పడకుండా బైక్ పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్య తీర్చాలని ఆయన అన్నారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చర్యలు, తీసుకుంటుందని అన్నారు, ఇటువంటి తరుణంలో కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు వచ్చే నూతన కమిటీ సెక్యూరిట్ గార్డ్ సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఇంకా ఈ సభలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిబాబు, సిటీ అధ్యక్షుడు మోహన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్. అనిల్ కుమార్, ఎం జాన్ బాబు, కాటూరి రాజు, కే వెంకటేష్, వి వెంకటరమణ, షఫీ ఖాన్, మేరా బి, రత్నం, ఎం వెంకటలక్ష్మి, ఎస్. వెంకటలక్ష్మి, రామలక్ష్మి, వి దుర్గాభవాని, గీతా దుర్గాభవాని తదితర సభ్యులు ప్రసంగించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


