త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. ప్రస్తుతం పీ.ఆర్ సబ్-డివిజన్ (ములకలపల్లి) హెడ్-క్వార్టర్స్ అశ్వారావుపేటలో ఉండటం వలన ములకలపల్లి, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు సేవలందించటంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో ములకలపల్లి అశ్వారావుపేట మధ్యదూరం 50 కి.మీ.ల కంటే ఎక్కువ ఉండటం వల్ల సంక్షేమ పనుల పర్యవేక్షణ ముఖ్యమైన కార్యకలాపాల నిర్వహణలో జాప్యం జరుగుతున్నందున ములకలపల్లి మండల హెడ్-క్వార్టర్స్ వద్ద అవసరమైన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నందున పీ.ఆర్ సబ్-డివిజన్ కార్యాలయాన్ని ములకలపల్లికి మార్చవలసిందిగా
గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పంచాయతీరాజ్, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క (అనసూయ)కి ఈరోజు హైదరాబాదులో వారి కార్యాలయం నందు తెలియజేయడం జరిగింది. మరియు యాస్.టి యాస్.డి యఫ్ నిధుల ద్వారా అవసరమైన సహకారం అందజేయవలసిన వినతి పత్రం అందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


