త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 24, తూర్పుగోదావరి జిల్లా, కడియం నర్సరీలు విజ్ఞానంతో పాటు ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని మొక్కలు ఉత్పత్తి అవ్వడం మన అదృష్టమని, విద్యార్థులు ఈ నర్సరీలను సందర్శించి పరిశీలిస్తే ఎంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని ఆలమూరు మండలం చెముడులంక ఎస్ టి ఎస్ ఎన్ ఎమ్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శివరాంకుమార్ అన్నారు. విద్యార్థులు పరిశ్రమ సందర్శనలో భాగంగా కడియం పల్ల వెంకన్న నర్సరీని సందర్శించారు. ఈ నర్సరీలో ఉత్పత్తి అవుతున్న మొక్కల యొక్క ఉపయోగాలను ఆ పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి పరిశీలించి వాటి యొక్క ఉపయోగాలను నర్సరీ మేనేజింగ్ డైరెక్టర్ పల్ల గణపతి నుండి అడిగి తెలుసుకున్నారు.
ఆయుర్వేదానికి సంబంధించిన వివిధ మొక్కలతో పాటు ఆహ్లాదానిచ్చే మొక్కలు, దేశ విదేశాల నుండి దిగుమతి చేసుకున్న మొక్కల నుండి కొత్త మొక్కల ఉత్పత్తి, వాటి యొక్క ఉపయోగాలు వాటిని పెంచే విధానాల గురించి విద్యార్థులకు వివరించారు. ఏ సమయంలో ఎరువులు వెయ్యాలి, మొక్కలపై రసాయన క్రిమిసంహారక మందులు పిచికారి చేయాలో వివరించారు. ఈ నర్సరీలో రూపుదిద్దుకుంటున్న ఒక్కొక్క మొక్క మానవ జీవితాలకు ముడిపడి ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బయాలజీ ఉపాధ్యాయురాలు ఎస్ లక్ష్మీరత్నం, వృత్తి విద్య ఉపాధ్యాయులు కే శ్రావణి, వి సూర్యకిరణ్, కోఆర్డినేటర్ రమేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


