Trinethram News : భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు బయలుదేరనున్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా, శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరనున్నారు. ఈ ప్రయోగాన్ని స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా చేపట్టనున్నారు
లు వాయిదాల అనంతరం భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా రోదసీ ప్రయాణం బుధవారం (జూన్ 25న) ప్రారంభం కాబోతోంది. యాక్సియమ్ మిషన్ 4 ద్వారా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) దిశగా అడుగులు వేయబోతున్నారు. దీంతో భారతదేశం తరఫున అంతరిక్షంలోకి వెళ్తున్న రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించనున్నారు. శుక్లా కంటే ముందు రాకేష్ శర్మ 1984లో రష్యా వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు. ఆయన వెళ్లిన నాలుగు దశాబ్దాల అనంతరం రెండో భారతీయుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టబోయే చారిత్రాత్మక ఘట్టం కోసం యావత్తు దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయాణం
ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు ప్రయోగం చేపట్టనున్నారు. ఫ్లోరిడాలోని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్.. 39ఏ లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ బయలుదేరనుంది. తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టిన అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఇక్కడి నుంచే 1969లో అపోలో 11లో ప్రయాణం ప్రారంభించారు. ఇక, లాంచింగ్‌కు వాతావారణం 90 శాతం అనుకూలంగా ఉన్నట్టు స్పేస్‌ఎక్స్ పేర్కొంది.
రాకేష్ శర్మ (1984) తర్వాత అంతరిక్షానికి వెళ్తోన్న రెండో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా . 39 ఏళ్ల శుక్లాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఆధ్వర్యంలో ప్రధాన వ్యోమగామిగా ఎంపిక చేశారు. మిషన్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రయాణానికి ముందు ఒక నెల పాటు కఠిన క్వారంటైన్‌లో ఉన్నారు నలుగురు వ్యోమగాములు 15 రోజుల పాటు ఐఎస్ఎస్‌లో ఉండి మొత్తం 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇందులో 7 ప్రయోగాలు భారత పరిశోధకులు ప్రతిపాదించినవే కావడం విశేషం..
ఐఎస్ఎస్‌కు చేరిన తర్వాత అంతరిక్షం నుంచి భూమిపై ఒక ప్రముఖ వ్యక్తితో శుక్లా ప్రత్యక్షంగా సంభాషిస్తారు. ఇది స్పేస్-టు-ఎర్త్ అవుట్‌రిచ్ కార్యక్రమంగా జరుగుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు. వీరితో కలిసి Ax-4 బృందం పనిచేస్తుంది.
వరుస వాయిదాలు
షెడ్యూల్ ప్రకారం మే 29న లాంచ్ చేయాల్సి ఉండగా.. అప్పటి నుంచి పలు కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చింది. వాతావరణ సమస్యలు, ఆక్సిడైజర్ లీక్, సాంకేతిక సమస్యలు కారణంగా వాయిదా పడినట్టు నాసా ప్రకటించింది. చివరకు అన్ని సమస్యలను అధిగమించి నేడు (జూన్ 25న) ప్రయాణం మొదలుకాబోతోంది.
నాసా భాగస్వామ్యంతో హ్యూస్టన్‌కు చెందిన ప్రయివేట్ సంస్థ యాక్సియమ్ స్పేస్ (Axiom Space) ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో నాసా చేపట్టిన నాలుగో మిషన్ ఇది. ఈ మిషన్ ప్రధాని మోదీ 2023 అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్‌తో కుదిరిన ఒప్పందంలో భాగమే. ఈ ఒప్పందం ద్వారా ISRO – NASA భాగస్వామ్యంలో భారత వ్యోమగామిని ISSకి పంపించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. కొన్ని వర్గాలు దీనిని మిషన్ ఆకాశ గంగ అని కూడా పిలుస్తున్నారు. భారత్-అమెరికాల మధ్య అంతరిక్ష ప్రయోగాల భాగస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


