
చింతకుంట, ముష్టిపల్లి, జాకారం తండాలలో యథేచ్ఛగా ఇసుక దందా – అరికట్టాలని తహశీల్దార్‌కు వినతి
Sand Mafia Racket : త్రినేత్రం న్యూస్/ షాద్నగర్ ప్రతినిధి…. మండల పరిధిలోని చింతకుంట తండా, ముష్టిపల్లి తండా మరియు జాకారం తండాల పరిసరాల్లో గత కొంతకాలంగా అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా రాత్రిపూట ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని, దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విచ్చలవిడి ఇసుక తోడకం వల్ల వాగుల ఉనికి దెబ్బతింటోందని, భారీ వాహనాల వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయని పేర్కొన్నారు.
అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, రైతులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

