Cries of Thirst : దాహం కేకలు

TRINETHRAM NEWS
Cries of Thirst

ఆదివాసీలకు తప్పని నీటి తిప్పలు!!

Cries of Thirst : అరకులోయ మార్చి 31, (త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం సిరిగం పంచాయతీ వర్ర తోకవలస గ్రామంలో నీటి సమస్య చాలా ఏలుగా తీవ్రంగా ఉంది. అయినా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.. ఈ గ్రామంలో అన్ని సీజన్లో నీటికి ఇబ్బంది ఉంటుంది.. ఈ పరిస్థితుల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానిధి, కానీ ఎన్ని ప్రభుత్వాలు మారిన గిరిజనుల గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు, అయితే గ్రామ సమస్యని సందర్శనార్థం సోమవారం ఆదివాసి గిరిజన సంఘ నాయకులు ఐసు బాబు గ్రామంలో పర్యటించి , గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ గ్రామ ఆదివాసీలు ప్రభుత్వాన్ని ఖాళీ బిందెలకు ధర్నాలు చేయాల్సినంత పరిస్థితి ఎందుకు ఆని, ప్రజా సమస్యలు పరిస్కరించని సోయలేని ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఆని,ప్రజలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి జలజీవన్ మిషన్ నిధులు మింగింది ఎవరు అనే ప్రశ్నలు తో ఈ కూటమి ప్రభుత్వo మీదమండి పడ్డారు. తెలంగాణలో ఇంటింటికి కులాయి సదుపాయం కల్పించారు.

మరి ఆంధ్రలో పరిస్థితి కులాయి కాదు కదా కులాయి గుంట కూడా లేదు అని ఐసుబాబు ఈ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. 75 వేల స్వతంత్ర భారతంలో, ఇంకా బిందెలతో కొండ ఆవాల ఉన్న కలుషిత నీరు తాగడానికి గిరిజనులు సిద్ధపడుతున్నారంటే, ఈ పాలకుల చేతకానితనం ఎలా ఉందో అర్థం చేసుకోవాలని ఐసుబాబు ప్రజల ఉద్దేశించి అన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన జల జీవన్ మిషన్ కింద ఒక్కో రాష్ట్రానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసినప్పటికీ, స్థానిక గిరిజన నాయకులు అధికారులు, చేతకానితనం వల్ల గిరిజనులకు కనీస అవసరమైన నీరు అందడం లేదని ఆంధ్రప్రదేశ్ ను ఏలిన అస్మర్థ ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా జలజీవన్ మిషను అంటూ తిరుగుతున్నారు. కేంద్రం 28 వేల కోట్ల రూపాయలను ఈ జలజీవన్ మిషన్ కింద మంజూరు చేసినప్పటికీ కానీ, రాష్ట్రఅసమర్థ పాలన వల్ల పనులు మాత్రం నత్తనడక గాసాగుతున్నాయి, దాని ఫలితమే కదా ఆంధ్రప్రదేశ్ లో, ఈ దాహం కేకలు అని నిలదీస్తుంది ఆదివాసి గిరిజన సంఘం. నీరు లేకపోతే ఎలా బ్రతుకుతారు అని సోయలేదు ఈ ప్రభుత్వానికి.

నీటి సమస్యను తీర్చాలంటూ కలెక్టర్ ఆఫీస్ కు కాళీ బిందెలతో పయనం అవుతామని తోక వలస క్రమంలో మహిళలు త్రినేత్రం న్యూస్ తో మాట్లాడారు. అదేవిధంగా తాగునీటికి కాల కృత్యాలకు ఒకే గెడ్డ నీరు తాగడం వల్ల గ్రామస్తులు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో విలవిలాడుతున్నారు,ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి తమ సమస్యను పరిష్కార దిశగా ప్రయత్నిస్తారని ఆదివాసి గిరిజన సంఘం తరఫున ఐసు బాబు హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top