Sand Smuggling : ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు

TRINETHRAM NEWS

ఇసుక అక్రమ రవాణా సమర్థవంతంగా అరికట్టాలి కమిషనర్ శ్రీనివాస్ ఐపిఎస్.,

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణా ను నియత్రించేందుకు సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి అన్నారు. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ మంథని ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఖమ్మం పల్లి, జిల్లాల పల్లి లోని ఇసుక తరలించే ఇసుక క్వారీ లను ఆకస్మికంగా సందర్శించారు.

క్వారీ సందర్శించి ప్రధానంగా రవాణాదారులు ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలపై పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికరులను ను అడిగి తెలుసుకున్నారు. వాహనాల వే బిల్స్ మరియు లోడ్ పరిమితి నీ పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా అక్రమంగా ఇసుక తరలించే వారి సమాచారాన్ని అందుబాటులో వుంచుకోవడంతో పాటు వారి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సీపీ అధికారులకు సూచించారు తనిఖీలు జరిపే సమయంలో సిబ్బంది తప్పనిసరిగా తనిఖీ చేసిన వాహన వివరాలను నమోదు చేసుకోవాలని ఇసుక తరలించే వాహనాలకు అనుమతి పత్రాలు ఉన్నాయో కూడా తప్పనిసరిగా పరిశీలించాలని. నిరంతరం ఇసుక రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

ఈ సందర్భంగా అక్కడ విధులలో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు.ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే అట్టి వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేసారు.ప్రస్తుతం ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ర్యాంపుల నుండి ఇసుక తరలించే విధానాన్ని పరిశీలించారు
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి డా. చేతన ఐపిఎస్ స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర, గోదావరిఖని ఎసిపి రమేష్, మంతిని సిఐ రాజు, ముత్తారం ఎస్ ఐ నరేష్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sand smuggling

You cannot copy content of this page

Scroll to Top