ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి లో మౌలిక సదుపాయాలు కల్పన పై దిశా నిర్దేశం
జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ కు తగిన ప్రతిపాదన పంపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. విశిష్ట ప్రతిభావంతులు వైకల్యం ధృవీకరణ పత్రం జారీ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు.
మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గవర్నమెంట్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ప్రిన్సిపల్, సూపరిండెంట్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో జి జి హెచ్ , సదరం క్యాంపు అంశాలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పరిధిలో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థోపెడిక్ విభాగం లో మెరుగైన వసతులు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. పిల్లల విభాగంలో వెంటిలేటర్ లు, కార్డియాలాజిస్ట్ స్పెషలిస్ట్ వైద్యులు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ కు ప్రతిపాదనలు పంపాలన్నారు. అదే విధంగా ఇటీవల కాలంలో ఎక్కువ కుక్క కాటు కు చిన్నారులు వైద్య చికిత్స కోసం రావడం జరుగుతోందనీ డాక్టర్లు తెలిపారు. ఎక్కువ కుక్క కాటు లకి చెందిన నగరపాలక సంస్థ, పంచాయతీ పరిధిలో కేసులు నమోదు అవుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం కింద స్టెరిలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలు, సిఫార్సులు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఉన్నత స్థాయి అధికారులకు పంపాలన్నారు.
జిల్లాలో ఐదు చోట్ల ప్రత్యేక సదరం క్యాంపు లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. త్వరలో నిడదవోలు సీ హెచ్ సి పరిథిలో కూడా సదరం క్యాంపు నిర్వహణ కోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలియ చేశారు. సదరం రీవెరిఫికేషన్ నిమిత్తం జిల్లాలో 32500 మంది దివ్యంగా పింఛన్లు తనిఖీ, రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు గత మూడు నెలల్లో 10500 పించన్లు తనిఖీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, పి ప్రశాంతి తెలిపారు. ఇంకా సుమారు 21 వేల సామాజిక భద్రత పింఛన్లు తనిఖీ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో శారీరక వైకల్యం, మానసిక వైకల్యం, కంటి చూపు లేని వారు, వినికిడి లోపం ఉన్నవారు, మల్టిపుల్ డిస్ఆర్డర్, అంగవైకల్యం కలవారు జిల్లాలో 32500 మంది ఉన్నారన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం, అనపర్తి, కడియం, కొవ్వూరు గోపాలపురం లో దివ్యాంగ పింఛన్ దారుల అంగవైకల్యం వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. .రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పటల్ లో ఇందు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏ రోజు సదరం క్యాంపు నకు హాజరు కావాలో ముందుగా తెలియ జేయడం జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో నిడదవోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు కూడా సదరం క్యాంపు నిర్వహణ కోసం తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రానున్న మూడు, నాలుగు నెలల్లో మిగిలిన 21 వేల మందికి చెందిన రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెన్డెంట్ డా ఎమ్ .లక్ష్మీ సూర్యప్రభ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి. సౌభాగ్య లక్ష్మీ, డి ఆర్ డి ఎ పి డి ఎన్ వి వి ఎస్ మూర్తి, డీల్డివోలు పి వీణా దేవి, ఏ. స్లీవా రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


