** తగిన సమాచారం అందించి సహకరించాలి
** జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి
Trinethram News : రాజమహేంద్రవరం : తూర్పు గోదావరి జిల్లాలో పి 4 సర్వే పబ్లిక్ , ప్రవేటు, పీపుల్స్ పార్టీసీపేషన్ సర్వే నిర్వహిస్తున్నట్లు, ఇప్పటి వరకు పబ్లిక్ ప్రవేటు భాగస్వామ్యం తో కలిసి పనిచెయ్యడం జరుగుతోందని కలెక్టర్ పి ప్రశాంతి మంగళవారం ఒక విడియో సందేశంలో పేర్కొన్నారు. ఇందులో ప్రజలని కూడా భాగస్వామ్యం చేసుకోవాలని, ఈ క్రమంలోనే జిల్లాలోని పేదల్లో పేదలని గుర్తించడం, వారి తలసరి ఆదాయం పెంచే ప్రయత్నం లో వారి ఆర్ధిక పరిస్థితి తెలుసుకుని, వారు ఏ పనిచేస్తే ఆదాయం వస్తుందని అనే అంశాలని ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం ఈ సర్వే చేపట్టడం జరుగుతోందని తెలిపారు.
ఇందు నిమిత్తం ఆగ్రామంలో ఎవరైతే ఆర్ధికంగా ఉన్నత స్థాయిలో ఉన్నారో గుర్తించి, వారి యొక్క సహకారం తీసుకోవడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఇందు కోసం సచివాలయం సిబ్బంది అందరినీ సర్వే లో పాల్గొనడం, వివరాలు తెలుసుకోవడం జరుగుతోందని, ప్రజలందరు ఈ సర్వే లో పాల్గొని తగిన సమాచారం అందించాలని కోరారు. మీ తోటి వారి అభివృద్ది కోసం ఆసక్తి కలిగి ఉన్నారో వారు సర్వే చేసే సిబ్బందికి తగిన సహకారం అందించి , మీ అంగీకారం తెలియ చెయడం జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో పేదల్లో పేద లని గుర్తించి వారికి మరింత మెరుగైన జీవన భృతి కల్పించడం ,అదే విధంగా వారి కుటుంబాల ఆరోగ్య, విద్యా ప్రమాణాలు పెంచడం ధ్యేయం , ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.
ఈ సర్వే చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి పి జి ఆర్ ఎస్ ద్వారా వారి సమస్యలు పరిష్కారం కోసం ఇస్తున్న అర్జిల యెుక్క పరిష్కార స్థాయి, ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకోవడం కూడా సమాంతరంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేసారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో, డివిజన్ మండల స్థాయి లో, ఆన్లైన్ పోర్టల్, సిఎం గ్రివియన్స్ ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఆయా అర్జీలను పరిష్కరించడం జరుగుతోందని, అయితే ప్రజల నుంచి ప్రత్యక్షంగా వారి సంతృప్తి స్థాయి తెలుసుకునే ప్రయత్నం జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
అధికారులు అర్జీలను పరిష్కారం చేశారా లేదా వారితో ఏ విధంగా ప్రవర్తించారు తదితర అంశాల గురించి సర్వే సందర్భంలో వివరాలు తెలుసుకోవడం జరుగుతుందని, వాటికీ కూడా తగిన రీతిలో స్పందించి మీ విలువైన అభిప్రాయాలను వ్యక్తం చెయ్యాలని కలక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. కావున జిల్లా ప్రజలందరు సర్వే సిబ్బంది కి పి 4 సర్వే వివరాలు, పిజిఆర్ఎస్ సర్వే వివరాలు తెలియ చేయండి మరింత మెరుగైన పరిపాలన అందించే ప్రయత్నం లో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.
జిల్లాలో 133548 గృహాలని 502 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న 3408 సచివాలయ సిబ్బంది ఈ సర్వే లో పాల్గొనడం జరుగుతున్నట్లు తెలిపారు. మార్చి 18 వరకూ సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు, సర్వే సిబ్బందికి తగిన సహకారం అందించి జిల్లా ప్రగతి పథంలో భాగస్వామ్యం కావాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


