గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి
త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి. ఈరోజు రోడ్డు ప్రమాదాల నియంత్రణ, సురక్షితమైన ప్రయాణం, వాహనదారుల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “అరైవ్ లైవ్” కార్యక్రమంలో భాగంగా, పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ని ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ ఐ రమేష్, అనూష మ్, మనోహర్ లు విస్తృత స్థాయిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
గోదావరిఖని లోని తిలక్ నగర్, రమేష్ నగర్, టాక్సీ అడ్డా, డి సి ఎం అడ్డా, రద్దీ ప్రదేశాలలో పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.., “అరైవ్ అలైవ్” కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని తెలిపారు. ప్రతి వాహనదారుడు. తప్పనిసరిగా హెల్మెట్, సిట్ బెల్ట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.
రోడ్డు ప్రమాడాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల సహకారంతోనే ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించవచ్చని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, సేఫ్ అండ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్దతులు అనుపరించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లు తదితర ఫోర్ వీలర్ వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
అలాగే ప్రతి వాహనదారుడి వద్ద డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే ధ్రువవత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో సంబంధిత పోలీస్ అధికారులు, వాహనదారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


