త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి… స్థానిక కృష్ణవేణి విద్యాసంస్థలలో … ఈరోజు వసంత పంచమి చదువుల తల్లి సరస్వతి మాత పుట్టినరోజు (వసంత పంచమి) పురస్కరించుకొని స్థానిక కృష్ణవేణి పాఠశాల అడ్డగుంటపల్లి, ఎన్టిపిసి లో చిన్నారి పిల్లల చేత సరస్వతీ మాత కటాక్షము లభించుటకై చిన్నారి పిల్లల చేత పలక బలపం పట్టుకొని వేదమంత్రాలతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.
ముందుగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మరియు పాఠశాల కరస్పాండెంట్ మంజుల శ్రీనివాస్ రెడ్డి విచ్చేసి మరియు వేద పండితులైన సంతోష్ సమక్షంలో పాఠశాలలో గల సరస్వతీ మాత*విగ్రహానికి పూలమాలలతో అలంకరించి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు వారి వారి పిల్లలను వేద పండితులైన సంతోష్ సమక్షంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పిల్లలను పలక బలపం పట్టుకొని ఓనమాలను పలకపై దిద్దించడం జరిగినది. అంతేకాకుండా 9వ తరగతి విద్యార్థులు పదవ తరగతిలో అడుగుపెడుతున్న సందర్భంగా వాళ్లకు కూడా వేదపండితులు సంతోష్ చేత పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగినది.
చివరగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోషకు లకు మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందము ను పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి పాఠశాల కరస్పాండెంట్ మంజుల శ్రీనివాస్ రెడ్డి అభినందించడం జరిగినది..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


