Arrive – Alive : సంతోషంగా వెళ్ళండి – సురక్షితంగా రండి: ‘అరైవ్ – అలైవ్’ తో అవగాహన కల్పిస్తున్న జిల్లా పోలీస్” జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి…తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశానుసారం, రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అరైవ్ – అలైవ్” కార్యక్రమంలో భాగంగా, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, సారథ్యంలో జిల్లావ్యాప్తంగా భారీ ఎత్తున డ్రంక్ & డ్రైవ్ పైన అవగాహన మరియు తనిఖీ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ప్రాణం ఎంతో విలువైనదని, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా, ఎదుటివారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపవద్దని ప్రజలకు తెలిపినారు.

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారని, ఆపై సాయంత్రం నిర్వహించిన ముమ్మర తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 90 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు.

కేవలం కేసులు నమోదు చేయడం మా ఉద్దేశ్యం కాదని, ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నదే ఈ “అరైవ్ – అలైవ్” కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ స్పష్టం చేశారు. యువత సరదా కోసం చేసే చిన్న పొరపాటు వారి భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తుందని, జిల్లావ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని ఎస్పీ సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Go Happy - Come Safely: District Police creating awareness

You cannot copy content of this page

Scroll to Top