మహిళల భద్రత మరియు రక్షణకి షీ టీమ్స్ తో మరింత భరోసా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలోని మహిళలు, బాలికల, విద్యార్థిని విద్యార్థుల భద్రతే షీ టీం లక్ష్యంగా పనిచేస్తునట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో రెండు షీ టీం బృందాలు పని చేస్తున్నాయని షీ టీం ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాలలో, స్కూల్స్ , కాలేజీ లలో ర్యాగింగ్/ఈవ్ టీజింగ్/పోక్సో/ గుడ్ టచ్ బ్యాడ్ టచ్/ఆత్మహత్యలు/డ్రగ్స్ /బాల్య వివాహాలు/వరకట్నం చట్టాలపై, నూతన మహిళా చట్టాలపై, డయాల్ 100, T-SAFE యాప్ మహిళ భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తునట్లు తెలిపారు. టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, ఆన్లైన్, QR code, వాట్సప్ ద్వారా కూడా స్వీకరిస్తారని తెలిపారు. మహిళలు, బాలికలపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టే వారు, సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్, షీ టీమ్ సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు.
మహిళలు బాలికలు విద్యార్థులు షీ టీం సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. ఎవరైనా వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడిన, ఉద్దేశపూర్వకంగా వెంబడించిన, అసభ్య కరంగా ప్రవర్తించిన, మాట్లాడిన విద్యార్థినిలు, మహిళలు అత్యవసర పరిస్థితులలో రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీం నెంబర్ 6303923700, పెద్దపల్లి జోన్ షీ టీమ్ నెంబర్ 8712659386 మంచిర్యాల జోన్ షీ టీమ్ నెంబర్ 8712659386 కి కాల్ చేసి, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డయల్ 100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సీపీ సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


