Annadanam for Devotees : కొండ బిట్రగుంటలో భక్తులకు అన్నదానం ప్రారంభించిన రావి .విజయ్ కుటుంబం సభ్యులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్:ఫిబ్రవరి 27: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం.. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ అధికారి అరవ రాధాకృష్ణ, గుంటుపల్లి రాజకుమార్ చౌదరి, తుమ్మల కోటారెడ్డి.. ,బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న వేళ, కొండ బిట్రగుంట గ్రామస్తులు, స్వామివారి భక్తుడు రావి విజయ్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం గత ఎనిమిది సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి సన్నిధికి విచ్చేసే వేలాది మంది భక్తులకు నిస్వార్థంగా అన్నదానం నిర్వహిస్తూ వస్తున్న రావి విజయ్ కుటుంబం ఈ ఏడాది కూడా అదే భక్తి భావంతో కార్యక్రమాన్ని ప్రారంభించింది.

శుక్రవారం స్వామివారి సన్నిధిలో ఆలయ అధికారి అరవ రాధాకృష్ణ, గుంటుపల్లి రాజకుమార్ చౌదరి, కోటారెడ్డి మరియు రావి విజయ్ కుటుంబ సభ్యులు చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రావి విజయ్ మాట్లాడుతూ, ఈరోజు నుంచి మార్చి 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల కాలమంతా భక్తులకు ప్రతిరోజూ అన్నప్రసాదం వితరణ నిర్వహిస్తామని తెలిపారు.

స్వామివారి కృపతో ఈ సేవ కొనసాగుతుందని, భక్తులకు సేవ చేయడం తమ కుటుంబానికి దక్కిన అదృష్టమని భావిస్తున్నామని చెప్పారు.అలాగే ఈ సేవా కార్యక్రమానికి సహకారం అందిస్తున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ,ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల ఆకలి తీర్చడం అనేది స్వామివారికి చేసే మహాసేవగా భావిస్తూ అన్నదానం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

అన్నదానం మహాదానం,అనే వాక్యానికి అర్థం చాటుతూ కొండ బిట్రగుంటలో భక్తి, సేవా భావం కలిసిన ఈ కార్యక్రమం భక్తుల హృదయాలను స్పృశిస్తోంది. బ్రహ్మోత్సవాల వేళ స్వామి నామస్మరణల మధ్య జరుగుతున్న ఈ అన్నదాన సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి అరవ రాధాకృష్ణ,గుంటుపల్లి రాజకుమార్ చౌదరి, తుమ్మల కోటారెడ్డి, వల్లేరి కిరణ్ కుమార్, ఐ.టీ.డీ.పి ,అధ్యక్షులు గోచిపాతల సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Annadanam for devotees in Konda Bitragunta

You cannot copy content of this page

Scroll to Top