విజిట్ లో భాగంగా ఎం ‌.పి .పి .ఎస్, బోగోలు ,ఎస్. సి, పాఠశాలను మరియు ఎం పి .పి .ఎస్ ,బోగోలు మెయిన్ పాఠశాలను సందర్శించడం జరిగింది

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 27: నెల్లూరు జిల్లా :బోగోలు మండలం.. ఈ పాఠశాలలో సి .ఎఫ్ .ఎల్ .ఎన్ ,లో భాగంగా ఎలా బోధించాలి, ఎలా బోధిస్తున్నారు అదేవిధంగా వర్క్ బుక్స్ కరే క్షన్స్, సిలబస్, ఎఫ్ .ఏ.4 మార్కులు ఎంట్రీ మరియు తెలుగు, ఇంగ్లీషు లో చదవడం, రాయడం మాథ్స లో చతుర్విధ ప్రక్రియలు చేయడం మీద పరిశీలించడం జరిగింది.

బోగోలు ఎస్సీ పాఠశాలలో ఒకటవ తరగతుకి అబాకస్ చట్రం ఉపయోగించి ఎలా మాథ్స్ చెప్పాలి అనేదాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఒకటో తరగతి పిల్లలు చక్కగా 20 వరకు ఇంగ్లీషులో వన్ టూ త్రీ లు బోర్డు మీద రాయడం జరిగింది. ఫ్రూట్స్ నేమ్స్, వెజిటేబుల్స్ నేమ్స్ ,మంత్స్, రోజులు స్పెల్లినింగ్స్, టేబుల్స్ ఇవన్నీ 2 వ తరగతి విద్యార్థులు చక్కగా బోర్డు మీద స్పెల్లింగ్ తో కూడా రాయడం జరిగింది.

ఒకటో తరగతి పిల్లలు వాక్యాలు ఇంగ్లీషులో చక్కగా చెప్పడం కూడా జరిగింది బోగోలు మెయిన్ పాఠశాలలో తీసుకున్నట్లయితే సెకండ్ క్లాస్ విద్యార్థులు ఇంగ్లీషులో వాక్యాలను చక్కగా చదివి మిగతా పిల్లలకు వినిపించడం జరిగింది.ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఆర్టికల్స్,ప్రిపోజిషన్స్ గురించి కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినారు.

మొత్తానికి జి ఎఫ్ ఎల్ ఎన్ అనే ప్రోగ్రామ్ పాఠశాలలో విద్యార్థుల యొక్క ప్రగతికి,పురోగతికి అనేక విధాలుగా ఉపయోగపడుతూ విద్యార్థుల్లో మంచి ప్రోగ్రెస్ ను చూపిస్తుంది.అలాగే ఏపీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ బోగోలు గురుకుల పాఠశాలకు 10వ తరగతి విద్యార్థుల 100 డేస్ ప్రోగ్రాంలో భాగంగా విజిట్ చేయడం జరిగింది.పిల్లలు కూడా 77 మంది పిల్లలు అక్కడ ఉంటే 60 మంది పిల్లలు చక్కగా షైన్నింగ్ స్టార్స్ గా ఉన్నారు .

మిగతా పిల్లలు కొద్దిగా డల్ గా ఉన్నారు. వాళ్లు కూడా 100 రోజులు,ప్రోగ్రాం పూర్తి నాటికీ సైనింగ్ స్టార్స్ స్థాయి చేయడానికి ప్రయత్నం చేస్తామని ప్రిన్సిపాల్ , స్టాప్ తెలియజేయడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

As part of the visit, M.P.P.S., Bogolu, S. C, School

You cannot copy content of this page

Scroll to Top