Sri Prasanna Venkateswara : సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి, 2025, జూన్ 09: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం యోగ నారాయణ స్వామి అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

ఉదయం 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సాయంత్రం 5 గం.లకు ఊంజల్ మండపంలోకి శ్రీవారు వేంచేపు చేస్తారు. అనంతరం సా. 5.30 – 6.30 గం.ల వరకు ఊంజల్ సేవ జరుగనుంది.

రాత్రి 7 గం.లకు ముత్యపు పందిరి వాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు.

వాహన సేవలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Prasanna Venkateswara in

You cannot copy content of this page

Scroll to Top