
Ration Shops : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 28 ; రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ చేపడుతున్నటువంటి సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని తెనాలి శాసనసభ్యులు, మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయన కాకినాడలో ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్ రైస్ పైలట్ ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించారు. అదనంగా 20 వేల మెట్రిక్ టన్నులు పార్భ యిల్డ్ ధాన్యం సేకరణకు కేంద్రం అనుమతిచ్చిందని అన్నారు.
అయితే రేషన్ దుకాణాల ద్వారా మీ మార్ట్ కాన్సెప్ట్ ను అమలు చేయనున్నారు. అదేవిధంగా రైతు బజార్లలో నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకే విక్రయించే చేపడుతున్నామని పేర్కొన్నారు. 29 వేల రేషన్ దుకాణాలను మరింత బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe