Rice : వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

TRINETHRAM NEWS

తేదీ :: 31/10 2025. ఖమ్మం జిల్లా, (త్రినేత్రం న్యూస్); సత్తుపల్లి నియోజకవర్గం, మండలం లో ఉన్నటువంటి రేజర్ల గ్రామపంచాయతీ నందు సొసైటీ చైర్మన్ , గ్రామ దీపిక, మాజీ సర్పంచ్ , రైతులు, ఏ ఈవో ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వాళ్లు తూకా నికి కొబ్బరికాయ కొట్టి, అధిక లాభాలు రావాలని, సంబంధిత రైతులకు అధిక లాభం వచ్చి వాళ్లు సంతోషంగా ఉండాలని, తెలిపారు. వరి పంటకు రైతు కనీస మద్దతు ధర రావాలంటే ఆధార్ కార్డ్, భూమి వివరాలు, బ్యాంకు ఖాతా నెంబరు, ఐఎఫ్ ఎస్ సి కోడ్, పాస్ పుస్తకము, జిరాక్స్ జతచేయాలి, సంబంధిత రైతు మొబైల్ నెంబర్, లేనిపక్షంలో కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. రైతులకు సంబంధించి వివరాలు చెప్పడం జరిగింది.
ఖరీఫ్ వానాకాలం రెండు వేల,ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఆరు వ సంవత్సరం ప్రభుత్వ కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ (సన్న రకం) క్వింటాల్ రూపాయలు రెండు వేల,మూడు వందల ఎనబై తొమ్మిది , కామన్ గ్రేడ్ (దొడ్డ రకం) క్వింటాల్ రూపాయలు రెండు వేల, మూడు వందల అరవై తొమ్మిది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, సొసైటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rice paddy purchase center launched

You cannot copy content of this page

Scroll to Top