
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
Ramavath Ravindra : చందంపేట జులై 01, త్రినేత్రం న్యూస్. చందంపేట మండలం ఉస్మాన్ కుంట గ్రామంలో నూతన నిర్మించిన అంజనేయ స్వామి ధ్వజ స్తంభం ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో బుధవారం మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు…..ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అని ఆయన అన్నారు.ఆంజనేయ స్వామి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాలనలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని అన్నారు. సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణ కోసం కేసీఆర్ విశేష కృషి చేశారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ సర్కారు నిర్విరామంగా కృషి చేసిందని అన్నారు. రాష్ట్రంలోని 4,805 ఆలయాల ధూప, దీప, నైవేధ్యాల కోసం ప్రభుత్వం ప్రతి దేవాలయానికి రూ.6వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించి ఆదుకున్నదని అన్నారు. దీనిలో రూ.2వేలు నిత్య పూజల కోసం, రూ.4 వేలు అర్చకుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం వచ్చిందన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు కేసీఆర్ కృషితో ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పున:నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను, కామన్ గుడ్ ఫండ్ నిధులతో ఇతర ఆలయాల జీర్ణోద్ధరణ, దేవాలయాల నిర్మాణ పనులను శరవేగంగా కేసీఆర్ సర్కార్ చేపట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ విశేష కృషి చేసిందన్నారు. అనంతరం మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ని గ్రామస్తులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, కేతవత్ శంకర్ నాయక్,సర్పంచ్ సత్యనారి, రామావత్ మోహన్ కృష్ణ,కేతావత్ రమేష్, లోటావత్ బీమా నాయక్, దాసు భావోజీ, ఉప సర్పంచ్ అను అతిరాం, ఫకీరా నాయక్, కేతావత్ హేము నాయక్, మంగ్య నాయక్,చందర్,లక్క,జబ్బర్, బిచ్చు, మంగతా, భాషా, జైల్ సింగ్,అరుణ్,అనిల్,తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe