జూలై 1, 2026
TRINETHRAM NEWS
National Doctors Day

National Doctors Day : దేవరకొండ డివిజన్ జులై 01, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ హాల్ లో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. . అధ్యక్షుడు ఎన్ వీ టీ, , ఎస్ ఐ నారాయణరెడ్డి సభ్యులతో కలిసి డాక్టర్స్ అందరిని శాలువాలతో సత్కరించి పూల మొక్కలు అందజేసారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే భగవంతుని రూపంలో డాక్టర్స్ పునర్ జన్మని ఇస్తారు అని ప్రాణాలను కాపాడటమే కాకుండా ప్రజల్లో ఆరోగ్య స్పృహను పెంపొందించడంలో వైద్యుల పాత్ర అసమానమైనది.

వైద్యులు సాధారణ ప్రజల్లో ఉండే అనారోగ్యాలు, మధుమేహం మరియు ఒత్తిడి వంటి సమస్యలపై అపోహలను తొలగించి, ప్రామాణిక వైద్య సలహాలను పాటించాలని సూచిస్తారు.ఈ దినోత్సవం సందర్భంగా మీ పరిసరాల్లోని లేదా మీకు సేవలు అందించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేయాలని అన్నారు. సూపర్డెంట్ డాక్టర్ రవి ప్రకాష్ మాట్లాడుతూ దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

డాక్టర్స్ చేస్తున్న సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే నాడు వారిని సత్కరించడం అభినందనీయమని అని ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్ కోశాధికారి కృష్ణ కిషోర్ ఏ టీ ఓ ప్రసన్న భాస్కర్ రెడ్డి కౌన్సిలర్ ముత్యాల రవి వంగూరు వెంకటేశ్వర్లు సన్నీ తాళ్ల సురేష్ ఐఎస్ఎఫ్ వల్ల మల్ల ఆంజనేయులు కౌన్సిలర్ సాయి చంద్ర గౌడ్ కౌన్సిలర్ పొట్ట మధు కరాటే మాస్టర్ గోపి 108 రాంబాబు కానిస్టేబుల్ అనుష ఐజాక్ నాగరాజు నరేష్ రాము విజయ్ జమీర్ క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page