జూలై 26, 2026
TRINETHRAM NEWS
Ramavat Ravindra Kumar

-అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కులేక రైతుల ఆవేదన .

-కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నది.
-కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఇప్పటికే అన్నదాతలకు అపార నష్టం .
-ఇప్పటికైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా సకాలంలో వడ్లు కొనుగోలు పూర్తి చేయాలి
-దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

Ramavat Ravindra Kumar : డిండి (గుండ్ల పల్లి) మే 14, త్రినేత్రం న్యూస్. డిండి మండలం తవకలాపురం లో ధాన్యం కొనుగోలు కేంద్రంను మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…..అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కులేక పోయారు అని అన్నారు.గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్తితిలో ప్రభుత్వం లేదు అని అన్నారు.కేసీఆర్ ఉన్నపుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదు అని ఆయన గుర్తు చేశారు.

అధికారులు ఏం చేస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో తిరగాలి అని సూచించారు ఈ ప్రభుత్వం రైతుల ను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 7గ్యారంటీలు,420హామీలు అమలు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు రాజీనేని వెంకటేశ్వర్ రావు,PACS చైర్మన్ మాధవరం శ్రీనివాస్ రావు, సర్పంచ్ మాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రవీందర్ రావు, గొడుగు వెంకటయ్య, గిరమోని శ్రీను,రమావత తులిసీరామ్, జంగయ్య,నాయకులు తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page