Ramadan Greetings : ముస్లిం సోదర సోదరి మణులకు రంజాన్ శుభాకాంక్షలు

TRINETHRAM NEWS
Ramadan greetings to Muslim brothers and sisters.

బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

Ramadan greetings : దేవరకొండ డివిజన్ మార్చ్ 20, త్రినేత్రం న్యూస్. రంజాన్ పండుగ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలోని ముస్లిం సోదరసోదరీమణులకు .. బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలతో రంజాన్ మాసం శాంతి,ప్రేమ,దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని,తెలంగాణలో గంగా జమునా తహజీబ్ కు రంజాన్ పండుగ ప్రతీక అని ఆయన తెలిపారు.దేవరకొండ నియోజకవర్గ ప్రజలంతా భక్తి, శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఇంటిల్లిపాది రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపాయని, అవన్నీ ప్రస్తుతం గుణాత్మక ఫలితాలనిస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ మైనారిటీల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అమలైన ప్రజా సంక్షేమ పథకాలు యావత్ దేశానికే దిక్సూచిగా మారాయని ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top