– మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 05, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6,5,10 వార్డులలో బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా రవీంద్ర కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….బిఆర్ఎస్ పార్టీ హయాంలో దేవరకొండ మున్సిపాలిటీ అభివృద్ధి జరిగింది అని ఆయన గుర్తు చేశారు.
ప్రజలకు 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆయన అన్నారు.అసాధ్యమైన, అమలుకాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పాలన ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్ర ప్రజలకు కష్టాలే మిగిలాయని విమర్శించారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో రైతును రాజుగా చేసి, తెలంగాణను అభివృద్ధి దిశగా నడిపించారని గుర్తు చేశారు.
దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రైతాంగాన్ని బలోపేతం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినవేనని స్పష్టం చేశారు.కళ్యాణ్ లక్ష్మి పథకంలో రూ.1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం కూడా రైతులు క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు నెలకు రూ.2,500, గ్యాస్ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ, వికలాంగులకు రూ.6,000, వృద్ధులకు రూ.4,000 ఇస్తామని చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పట్టణాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కేతావత్ బిల్యా నాయక్, నేనావత్ కిషన్ నాయక్, గాజుల ఆంజనేయులు,పార్టీ అభ్యర్థులు ముదిగొండ హరిదాస్, జక్కుల రాజేశ్వరిశ్రీనివాస్, పంగునూరు సరిత తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


