జూలై 7, 2026
TRINETHRAM NEWS
Rajnath Singh visit Hyderabad today

Rajnath Singh visit Hyd : Jun 12, 2026, తెలంగాణ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం తెలంగాణలో పర్యటించనున్నారు. దేశంలో 12 ఏళ్ల మోదీ పాలన విజయాలపై బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్ చేరుకున్నాక, ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మాజీ ఏబీవీపీ సెక్రటరీ మాండవా ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లి, అనంతరం డీఆర్‌డీఎల్‌లో కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం మేధావులతో సమావేశమై, రాత్రికి ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో బస చేస్తారు. శనివారం ఉదయం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొని ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page