BJP : బిజెపి రాష్ట్ర పార్టీ ప్రజా సమస్యలపై పిలిపిస్తే అరెస్టుల

TRINETHRAM NEWS

డ్రైనేజ్ వ్యవస్థ నాలా వ్యవస్థ రోడ్లపై గుంతల మయంగా మారిన దుస్థితి గురించి ప్రశ్నిస్తే అరెస్టుల:- అమ్రాబాద్ బిజెపి మండల అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అమ్రాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమంగా తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు అరెస్టు చేయడం జరిగింది ఈ అరెస్టుకు నిరసిస్తూ అమ్రాబాద్ బిజెపి మండల అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సేవ్ తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు హైదరాబాద్కు వెళుతున్నారని తెలుసుకొని అరెస్టు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాకాలంలో చిన్న గ్రామాల నుండి పెద్ద పట్టణాల వరకు డ్రైనేజీ వ్యవస్థ ప్రాజెక్టు లాగా నీరు నిండి రోడ్డుపై పొంగి పొర్లుతున్నాయి రోడ్లు తెలంగాణ వ్యాప్తంగా గుంతల మయంగా మారి వాహనదారులకు పాదాచారులకు నానా ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరియు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ప్రజా హక్కులను దుర్వినియోగం చేయడం ప్రజల అవసరాలు అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన లేకపోవడం సరైన ప్రణాళిక లేకపోవడం నిధులను విడుదల చేయకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి పాతబడిన డ్రైనేజీ వ్యవస్థను ఆధునికరించకపోవడం వల్ల మురుగునీరు రోడ్ల పైన ఇళ్ల దగ్గర నిలిచిపోయి ప్రజలు అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది కావున ఇప్పుడైనా ప్రభుత్వము అధికారులు కలిసి డ్రైనేజీ వ్యవస్థను నాలా వ్యవస్థను గుంతల మయం అయినటువంటి రోడ్లను వెంటనే పూర్తి చేసి ప్రజల బాగోగులను తెలుసుకొని సమస్యను పరిష్కరించాలి కానీ పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న బిజెపి నాయకులను అరెస్టులు చేసినంతమాత్రాన ప్రజలు చూస్తూ ఊరుకోరని రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గంగిశెట్టి నాగరాజు నోముల చంద్రయ్య గౌడ్ జబ్బు కృష్ణ యాదవ్ నోముల రాజు గౌడ్ భోగరాజు శంకర్ గారు ఉప్పల పరమేష్ నోముల శంకర్ గౌడ్ కంచర్ల అజయ్ టేకులపల్లి మల్లేష్ యాదవ్ తదితరులను అరెస్టు చేయడం జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BJP state party to be arrested

You cannot copy content of this page

Scroll to Top