జూలై 7, 2026
TRINETHRAM NEWS
Eradicate Child Labor

Eradicate Child Labour : త్రినేత్రం న్యూస్ : కడియం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు పిలుపునిచ్చారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కడియంలోని అంగన్‌వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, క్రాఫ్ట్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోస్టర్ల ద్వారా బాల కార్మిక వ్యవస్థ దుష్పరిణామాలను ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, విద్యకు ప్రాధాన్యత కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనుల్లో నియమించడం చట్టవిరుద్ధమని, ఉల్లంఘనలకు పాల్పడిన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.
పిల్లలు ఎక్కడైనా పనులు చేస్తున్నట్లు గుర్తిస్తే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సూచించారు. జూన్ 12 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా కార్మిక శాఖ, పోలీసు శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాల కార్మికులను గుర్తించి వారికి పునరావాసం కల్పిస్తామని పేర్కొన్నారు. పిల్లలు పుస్తకాలు పట్టాలి గానీ పనిముట్లు కాదు. వారి బాల్యాన్ని కాపాడడం సమాజం బాధ్యత అని అధికారులు అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page