TELANGANA

MLA Nenavat Balu Naik : ప్రతి ఇంటికి అండగా ఉంటా

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 05, త్రినేత్రం న్యూస్ . మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో స్థానిక కార్యకర్తలు,నాయకులతో కలిసి గడపగడపకు వెళ్తూ, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకుల కరుణాకర్ (వై ఎస్) కి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ .
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడి పనిచేస్తోందని, పేదలు, మధ్యతరగతి వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధిస్తే పట్టణాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని తెలిపారు.
దేవరకొండ పట్టణంలోని 17వ వార్డులో ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమని, త్రాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

I will support every house

You cannot copy content of this page