MLA Adireddy Srinivas : కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకు విముక్తి

TRINETHRAM NEWS

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

మున్సిపల్‌ కాలనీ వాంబే గృహాల్లో ఇంటింటికీ కుళాయి ప్రారంభం

రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తమ కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకు విముక్తి లభిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. స్థానిక 42వ డివిజన్‌ మున్సిపల్‌ వాంబే గృహాల వద్ద నగర పాలక సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటింటికీ కుళాయిలను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ మున్సిపల్‌ కాలనీ వాంబే గృహాల్లో ఉన్న 99 ఫ్లాట్లకు ఇంటింటికీ కుళాయి వేయించాలని 2014లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో టీడీపీ స్థానిక డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ మళ్ల వెంకటరాజు సతీమణి కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో అప్పటి కౌన్సిల్‌లో ప్రతి పాదించడం జరిగిందని గుర్తు చేశారు. ఇక్కడ ఇంటింటికీ కుళాలు వేయించాలని 2014లో పెట్టిన ప్రతిపాదన అమలు కావడానికి 11 ఏళ్ల పట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉండి ఉంటే ఈ పాటికే ఈ పనులు పూర్తయి ఉండేవన్నారు. అయితే 2019 నుంచి 2024 వరకూ అధికారంలో ఉన్న వైకాపా నాయకులు మాకెందుకులే అనుకున్నారేమో అందుకే ఇన్నేళ్లు పట్టిందని, ఈ ప్రాంత ప్రజలు తమను అభిమానిస్తున్నారనే ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రతిపాదనను ఆపేశారని అన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న 99 ఇళ్లకు కూడా ఇంటింటికీ కుళాయిలు వేయించామన్నారు. నీళ్లు మంచి ఫోర్సుతో వచ్చే విధంగా పని పూర్త చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో చేయాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయన్నారు. పక్కనే ఉన్న సంజీవయ్య పార్కును కూడా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. నగరంలో పార్కుల అభివృద్ధి విషయంలో గతంలోనే తాము చెప్పిన మాదిరిగానే ప్రస్తుతం మున్సిపల్‌ కాలనీ పార్కుల్లో మొక్కలు నాటడం, వాకింగ్‌ ట్రాక్‌ వేయడం తదితర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే పార్కును ప్రారంభిస్తామన్నారు. ఏది ఏమైనా ప్రజలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు తమ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికారులు కూడా ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరిస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రవి, మళ్ల వెంకటరాజు, కేవీ శ్రీనివాస్‌, సావిత్రి, చంద్రరావు, పేరూరి అంజి, సింహాద్రి సతీష్‌, ఆడారి లక్ష్మీనారాయణ, ఇంజి రాజబాబు, మోతా పండు, వానపల్లి శ్రీనివాస్‌, జలేం నాని, పోలిశెట్టి భైరవ, బీజేపీ ఆచార్య, వాంబే గృహాల మహిళలు, నగర పాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Public problems solved in

You cannot copy content of this page

Scroll to Top