తిరంగా యాత్రను విజయవంతం చేద్దాం
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు
రాజమహేంద్రవరం : త్రినేత్రంన్యూస్ ప్రతినిధి,
పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా ‘‘ఆపరేషన్ సింధూర్’’ ద్వారా ప్రపంచానికి మన సైనిక శక్తిని తెలియచేసి… ఇది మన సైనికుల వీరత్వానికి, మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనమని చాటి చెప్పడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ నేపధ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో తిరంగ యాత్ర ` దేశ భక్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో పార్టీ నగర సమన్వయ కమిటీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజలందరికీ గర్వకాణమైన విజయమని, దేశ భద్రతను కాపాడేందుకు త్రివిధ దళాల సంకల్పాన్ని ఈ ఆపరేషన్ పునరుద్ఘాటించిందన్నారు.
ఈ అఖండ విజయానికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తున్నందున మనమంతా సాయుధ దళాలకు సమిష్టిగా కృతజ్ఞతాభినందనలు తెలియచేయాల్సిన అవసరం ఉందని, ఆపరేషన్ సిందూర్ అఖండ విజయం సాధించడం పట్ల మన దేశ సాయుధ దళాల శౌర్యం, ధైర్యం, త్యాగాలను గౌరవించడానికి తిరంగ యాత్ర నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ తిరంత యాత్ర శనివారం సాయంత్రం 4 గంటలకు పుష్కరాల రేవు నుంచి కోటగుమ్మం మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకూ కూటమి నాయకులు, ప్రజలతో కలిసి జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీల జెండాలు లేకుండా సుమారు 5 వేల జాతీయ పతాకాలతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మన సైనికులకు, దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమర్ధన తెలియజేస్తూ.. తిరంగా యాత్ర నిర్వహించి భారత్ సైన్యంతో మేము ఉన్నామనే సంకేతం ఇచ్చేందుకే ఈ ర్యాలీ నిర్వహించడం జరగుతోందన్నారు.
దేశం మొత్తం ఆపరేషన్ సింధూర్ వెంటే ఉంది అంటూ మన త్రివిధ దళాల సైన్యానికి మనో ధైర్యాన్ని, కొండంత ఉత్సాహాన్ని కల్పిస్తూ.. మన జాతీయ జెండాను చేత పట్టుకుని మనం, మన స్నేహితులు, అదేవిధంగా సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని, మన కర్తవ్యాన్ని నిర్వహించే ఈ ర్యాలీకి బాధ్యత కలిగిన దేశ పౌరులంతా హాజరుకావాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అనంతరం నగరంలో నిర్వహించడబోయే మినీ మహానాడు, ఈ నెల 27, 28 తేదీల్లో కడపలో జరగబోయే మహానాడు రాజమహేంద్రవరం నుంచి ఎంత మంది వెళ్లాలి, ఎలా వెళ్లాలనే తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కాశి నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, దొండపాటి సత్యంబాబు, నల్లం శ్రీను, రాచపల్లి ప్రసాద్, మాటూరి రంగారావు, నిమ్మలపూడి గోవింద్, కంటిపూడి శ్రీను, కొల్లి బుజ్జి, ద్వారా పార్వతి సుందరి, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, శెట్టి జగదీష్, కురుమిల్లి విజయశేఖర్, మొకమాటి సత్యనారాయణ, చాపల చిన్నరాజు, జవ్వాది మురళి, సయ్యద్ అప్సరి, మదీనా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


