కడప మహానాడుకు బయలుదేరిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు…
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం రూరల్… కడప జిల్లా సికె దిన్నె వద్ద ఈనెల 27 28 29 తేదీలలో జరిగే తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసుపు పండగ మహానాడుకు రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన 40 కార్లలో 200 మంది నాయకులు, కార్యకర్తలతో కలసి మహానాడుకు తరలి వెళ్లారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పసుపు పండగ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాదిమంది కార్యకర్తలు తరలి వస్తున్నారని తెలిపారు.
ఈనెల 28వ తారీఖున తెలుగు వారందరి ఆరాధ్య దైవం, యుగపురుషుడు, మహనీయులు,నందమూరి తారకరామారావు, జయంతి సందర్భంగా మహానాడు నందు ఘన నివాళులు అర్పించడం జరుగుతుందని తెలిపారు. వారితో పాటు ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఏ.ఎం.సీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, నున్న కృష్ణ, కురుకూరి కిషోర్, ప్రత్తిపాటి రామారావు చౌదరి, చెల్లుబోయిన శ్రీనివాస్, వాసిరెడ్డి బాబి, పితాని శివరామకృష్ణ, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, పండూరి అప్పారావు, దేవుళ్ళ రాంబాబు, వట్టుకూడి దత్తుడు, గుర్రపు సత్యనారాయణ, దుద్దుపూడి రమేష్, తలారి మూర్తి, మట్ట శ్రీను, ఉండవెల్లి బంగార్రాజు, షేక్ ఖాసిం, కొప్పిశెట్టి నాగేశ్వరరావు, సురపు జానకి రామయ్య, ఐ టి డి పి సభ్యులు, తదితరులు కార్యకర్తలతో కలిసి తరలి వెళ్లారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


