త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు కొనియాడుతున్నారని అన్నారు.సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అర్జీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కూటమి ప్రభుత్వానికి మన్ననలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజు క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో 80 వినతులను నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అందజేసినట్లు తెలిపారు.వీటి పరిష్కారం కోసం ఆయా శాలల అధికారులకు సదరు అర్జీలను అందజేయడంతో పాటుగా ఆన్లైన్ లో కూడా నమోదు చేస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు వెల్లడించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


